తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో మళ్లీ అధికారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ క్రమంలో అధికారం మాదేనంటూ కేటీఆర్, హరీష్ పేర్కొంటూ బీఆర్ఎస్ లో జోష్ నింపుతున్నారు.. కాగా.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. జ్యోతిష్యం చెప్పించుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు