Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్నాళ్లుగా ఎవరు పాపులర్ కావాలనుకున్నా కూడా మెగా ఫ్యామిలీపై లేదా మెగా హీరోలపై విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి మీడియా కూడా వెన్ను దన్నుగా నిలస్తూ వారి టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడంతో పాటు, విమర్శలు చేస్తున్న వారికి పబ్లిసిటీ చేస్తున్నారు. ఇలా రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేష్‌లతో పాటు పలువురు మెగా హీరోలపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌ను అత్యంత దారుణమైన పదజాలంతో దూషించింది. పవన్ కళ్యాణ్‌ను దూషిస్తే పబ్లిసిటీ వస్తుందని భావించి అలా చేశాను అని, నా వెనుక వర్మ ఉన్నాడు అంటూ స్వయంగా శ్రీరెడ్డి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీపై వస్తున్న విమర్శలకు, దాడులకు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మెగా ఫ్యామిలీ సన్నిహితులు భావిస్తున్నారు.
మౌనంగా ఉంటే చేతకాని తనంగా భావించి ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని, ఇకపై అలాంటి విమర్శలకు వెంటనే సీరియస్ సమాధానాలు ఇవ్వాల్సిందే అని మెగా కాంపౌండ్ నిర్ణయించుకుంది. మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వ్యక్తి బన్నీ వాసు ఈ విషయమై మీడియా ముందుకు వచ్చాడు. మీడియాలో మెగా హీరోల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, ఇకపై మెగా ఫ్యాన్స్‌తో పాటు, మెగా ఫ్యామిలీ సభ్యులం అయిన మేము కూడా సీరియస్‌గా రెస్పాండ్ అవుతామని, మెగా హీరోల మీద చేసే ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని, వారి విమర్శరలకు తాము సీరియస్‌గానే సమాధానం ఇస్తామని బన్నీ వాసు పేర్కొన్నాడు. ఇకపై మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసే వారితో యుద్దం చేస్తామంటూ బన్నీ వాసు ఇండైరెక్ట్‌గా వర్మ, శ్రీరెడ్డి, కత్తి మహేష్‌లకు వార్నింగ్ ఇచ్చాడు.