Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో ఇంకో సారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందా ?. ఎస్. ఔననే.. విశ్వసనీయ వర్గాల సమాచారం. క్యాబినెట్ లో కొందరి పని తీరు తాను అనుకున్నట్టు లేకపోవడంతో పాటు మరి కొందరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచన లో సీఎం చంద్రబాబు ఉన్నారట. వచ్చేది ఎన్నికల ఏడాది కాబట్టి క్యాబినెట్ సభ్యులు ఇంకా సమర్ధంగా పని చేయాలని బాబు ఆశిస్తున్నారు. అయితే ఇద్దరు ముగ్గురు ఆయన ఆశిస్తున్న ప్రమాణాలు అందుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరుముగ్గురికి డిసెంబర్ లో ఉద్వాసన చెప్పే అవకాశం ఉందట. అదే సమయంలో కొత్తగా మంత్రివర్గంలో తీసుకునే వారిని రాజకీయ కోణంలో ఎంపిక చేసే ఛాన్స్ ఉందన్న మాట వినిపిస్తోంది.
ఈసారి మంత్రి ఉద్యోగానికి ఎసరు పడే జాబితాలో మొత్తం ముగ్గురు కోస్తా ప్రాంతం వాళ్లే అన్న టాక్ వుంది. ఇక జగన్ పాదయాత్ర మొదలు అయ్యాక ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీ నుంచి వచ్చే ఒకరికి క్యాబినెట్ లో ఛాన్స్ ఉంటుందన్న అంచనాలు కూడా వున్నాయి. ఈసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రెడ్లు,కాపులు, బీసీ లకి పెద్ద పీట వేశారన్న ఇమేజ్ రాబోతుందట. అంటే రానున్న ఎన్నికల దృష్టితో ఎన్నికల కూర్పు వుండబోతోంది.