బురుండీ దేశాధ్యక్షుడు ఎన్ కురుంజిజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయన వయసు 55 సంవత్సరాలు. గత శనివారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. సోమవారం నాడు కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. అయితే వెంటనే ఆయనకు గుండెపోటు వచ్చిందని.. డాక్టర్లు ఆయన్ను కాపాడేందుకు విఫలయత్నం చేసినా ఫలితం లభించలేదని అధికారులు వెల్లడించారు.