Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Cc Tv Cameras Making Problems At Trafic Signals In Delhi Roads
రోడ్డుపై అపరిచిత మహిళలకు, కొలీగ్స్ కు లిఫ్ట్ ఇస్తున్నారా. అయితే మీ కాపురాలు కూలిపోవడం ఖాయం. అదేంటి అనుకుంటున్నారా.. ఢిల్లీలో అలాగే జరుగుతోంది. ట్రాఫిక్ చలానాల కోసం రోడ్ల మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు.. నిబంధనల ఉల్లంఘించిన వారికి ఫోటోలతో సహా సాక్ష్యాలు పంపుతున్నాయి. ఈ దెబ్బకు పెళ్లాం ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మొగుళ్లు గుడ్లు తేలేస్తున్నారు.
ఇటీవలే ఢిల్లీలో ఓ పచ్చటి కాపురం ట్రాఫిక్ చలాన్ల దెబ్బకు కూలిపోయింది. ఓ వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ.. తన కొలీగ్ అయిన మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ మహిళ అతడి బైక్ పై కూర్చుని ప్రయాణించడం ట్రాఫిక్ సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి తోడు సదరు వ్యక్తి సిగ్నల్ ఉల్లంఘించడంతో.. ఇంటికి చలానా వచ్చింది. ఇంటికి వచ్చిన చలానాలో భర్త మరో మహిళతో ఉండటం చూసి భార్య నిలదీసింది.
భర్త నిజం చెప్పడం లేదని, తనకు ద్రోహం చేసి మరో మహిళతో వివాహాతేర సంబంధం పెట్టుకున్నాడని భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి భర్తను విచారించారు. భర్త చెప్పిన ఆన్సర్ నమ్మబుల్ గానే ఉన్నా.. ఎందుకైనా మంచిదన భార్య ఫిర్యాదు చేసిన కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారట. దీంతో సదరు భర్త గారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
మరిన్ని వార్తలు:
నవరత్నాలే నెగ్గే మార్గాలంటున్న జగన్






