Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల మీద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ జరుగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఈ నెల 21 , 22 తేదీల్లో విభజన హామీలు, ఇచ్చిన నిధుల వివరాలతో పాటు ఢిల్లీ కి రావాలని రాష్ట్ర అధికారులకి కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపాదించిన కేంద్ర సంస్థల నిర్మాణపు పనులు, కడప ఉక్కు కర్మాగారం కి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలతో రావాలని అధికారులకి కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా సంబంధిత అధికారులకు ప్రత్యేక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే లోపే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే ఇలాంటి సంకేతాలు, చర్చలు ఎన్నోసార్లు జరిగినా ప్రయోజనం లేకపోవడంతో కేంద్రం పిలుపు మీద ప్రజల్లో పెద్దగా అసలేమీ లేవు. కానీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల్లోని ముఖ్యులు మాత్రం ఇప్పటికీ సయోధ్య అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరికీ సన్నిహితులైన కొందరు వాణిజ్య వేత్తలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. దాని ఫలితమే ఈ నెల 21 , 22 న జరిగే సమావేశాలు.