రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తారా..?

central minister smriti irani demands to bans Pehredaar Piya Ki serial

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మీడియా అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. కేవలం న్యూస్ ఛానెల్సే కాదు.. ప్రోగ్రామింగ్ ఛానెల్స్ కూడా ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే. సమాజంలో ఉన్న విలువల్ని చూపించడం ఎప్పుడో మర్చిపోయిన ఛానెళ్లు.. లేని సంబంధాల్ని హైలైట్ చేసి చూపిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ టీవీ సీరియల్ ఓ చిన్న బాబు.. యువతిని పెళ్లి చేసుకోవడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.

ఈ సీరియల్ పై విమర్శలు వెల్లువెత్తడంతో.. అసలా సీరియల్ ఏంటని కేంద్రం ఆరా తీసింది. నివేదిక తెప్పించుకుంటే తొమ్మిదేళ్ల అబ్బాయి. పద్దెనిమిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పర్యవసానాలే కథ. ఇలాంటి స్టోరీ ఏంటని మాజీ టీవీ నటి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సీరియస్ అయ్యారట. సదరు ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని బ్రాడ్ కాస్టింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ కూడా రాశారట.

ఏకంగా చిన్న పిల్లాడితో యువతి పెళ్లి చేయడమే కాకుండా శోభనం, హనీమూన్ అని రిఫరెన్సులు ఇస్తూ సీన్లు ప్రసారం చేయడం ఇంకా అభ్యంతరకరంగా మారింది. దీంతో సీరియల్ పై చర్యలు తీసుకోవాలని ఆన్ లైన్ పిటిషన్ పై సంతకాలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కేంద్రం వెంటనే ఛానెల్ కు నోటీసులిచ్చింది. టీఆర్పీల కోసం ఇలాంటి పనికిమాలిన సీరియల్స్ తీయకుండా అన్ని ఛానెళ్లకూ బుద్ధొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

మా అధ్యక్షుడు ఎమ్మెల్యే కానున్నాడా?

అదే నిజమైతే ఉలికెందుకు..?

స్వతంత్ర భారత్ అనుకున్నది సాధించిందా..?