Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యి మూడు నెలలు పూర్తి అవుతున్న సమయంలో ఎట్టకేలకు మొదటి సక్సెస్‌ను రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రంతో దక్కించుకున్నాడు. 2018లో మొదటి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం విజయానందంతో ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ వారంలో రంగస్థలంకు పోటీ లేదు కనుక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురియడం ఖాయం. అయితే వచ్చే వారంలో ఒక పెద్ద సినిమా విడుదల కాబోతుంది. దాంతో ఈ చిత్రం కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.
వచ్చే వారంలో విడుదల కాబోతున్న సినిమా మరెవ్వరిదో కాదు పవన్ కళ్యాణ్ నిర్మించిన ‘ఛల్ మోహన్ రంగ’. నితిన్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఆ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో తప్పకుండా ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉన్నా కూడా మొదటి వారం రోజులు పవన్ క్రేజ్‌తో అయినా నడిచేయడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. రామ్ చరణ్ సినిమాకు ఆ సినిమా వల్ల ఖచ్చితంగా డ్యామేజీ జరగడం ఖాయం అని, చూస్తూ చూస్తూ అబ్బాయికి బాబాయి ఇలా పోటీ అయ్యాడు ఏంటి అని కొందరు మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.