Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ సీఎం చంద్రబాబుకు పార్టీలకు అతీతంగా పని విషయంలో మంచి పేరుంది. ఆయన చేస్తున్నంత కష్టం.. మంత్రులు చేయడం లేదని ఏపీ జనంలో కూడా విస్తృతమైన అభిప్రాయం ఉంది. చంద్రబాబుకు ప్రతిరోజూ పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పనిచేయడం అలవాటు. ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉండే చంద్రబాబు.. స్టేజ్ పై అనారోగ్యానికి గురికావడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. కానీ ఈసారి ఆ సీన్ కనిపించింది.
అమరావతిలో మెడ్ సిటీ వర్సిటీకి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఆ సందర్భంగా ఇరవై నిమిషాలు మాట్లాడారు. అంతా బాగా సాగిపోతున్న సమయంలో.. సీఎం అర్థాంతరంగా ప్రసంగం ఆపేసి కూర్చుండిపోయారు. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు. పది నిమిషాల పాటు తన కుర్చీలో సైలంట్ గా కూర్చున్న సీఎం.. మళ్లీ యథావిధిగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎంకు పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్లే అలా జరిగిందని వైద్యులు తేల్చారు.
సీఎంకు పనిభారం పెరిగిపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎవరూ సరిగా పనిచేయడం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రే రాష్ట్రమంతా తిరిగి కష్టపడటం ఎలా సాధ్యమౌతుందని అడుగుతున్నారు. అయితే బాబు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఏదో పొరపాటున ఇలా జరిగిందని, ఇకపై సీఎం మరింత జాగ్రత్తగా ఉంటారని ఆయన సన్నిహితులు పార్టీ క్యాడర్ కు భరోసా ఇస్తున్నారు.
మరిన్ని వార్తలు: