Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా తమకు అంతా అనుకూలంగా ఉందని చెప్పుకుంటారు. కానీ నెగటివ్ ఉన్నా బయటపడరు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం నంద్యాల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తున్న చంద్రబాబు.. హౌసింగ్ లో ప్రజా వ్యతిరేకత ఉందని బాహాటంగా ప్రకటించడం పార్టీ వర్గాల్నే ఆశ్చర్యపరిచింది.
గతంలో ఎన్నికల వ్యూహాలకు భిన్నంగా ఇలాంటి ప్లాన్లు గీయడం చర్చనీయాంశమైంది. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాల్ని అప్ డేట్ చేసుకునే చంద్రబాబు జగన్ దూకుడుకు చెక్ పెట్టడానికి కొత్త ప్లాన్ వేశారు. ప్రజా వ్యతిరేకతను అంగీకరించడం ద్వారా ప్రభుత్వం నిజాయితీగా ఉందన్న సంకేతాల్ని ప్రజలకు పంపాలని, తద్వారా మరికొన్ని సానుభూతి ఓట్లు వైసీపీ శిబిరం నుంచి లాగాలనేది వ్యూహం.
పైగా ముందుగానే ప్రజా వ్యతిరేకతను ఒప్పుకుంటే.. అధికార పక్షం ఓటమి అంగీకరించిందని వైసీపీ సంబరపడుతుందని, అప్పుడు పోటీని లైట్ తీసుకుంటుందనేది బాబు భావన. అలా ఏమరుపాటుగా ఉన్న ప్రత్యర్థిపై పైచేయి సాధించడం తేలికని, ఉపఎన్నిక కోసం సామ, దాన, భేద, దండోపాయాలు ఉఫయోగించాలని మంత్రులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.
మరిన్ని వార్తలు