Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త దూరం అవుతాను అని, అక్టోబర్ నుండి రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తాను అంటూ ప్రకటించాడు. సినిమాల సంఖ్యను తగించి, తక్కువ సమయం కేటాయిస్తాను అంటూ ప్రకటించాడు. దాంతో మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగాస్టార్ కూడా పవన్ నిర్ణయంపై స్పందించాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతాను అంటూ ప్రకటించడం నాకు కాస్త బాధను కలిగించిందని, రాజకీయాలు వద్దని తాను చెప్పడం లేదు. ఆ సమయంలోనే సినిమాలు కూడా చేయాలని, సినిమాలను వదిలి వేయడం వల్ల తాను పెద్ద తప్పు చేసినట్లుగా ఇప్పటికి భావిస్తున్నాను. రాజకీయాలు చేస్తూ కూడా సినిమాలు చేయవచ్చని, కాస్త ఎక్కువ సమయం రాజకీయాల్లో ఉన్నా కూడా సినిమాలకు దానికి తగట్లుగా ప్లాన్ చేసుకోవాలంటూ చిరంజీవి తాజాగా ఒక సందర్బంలో మీడియాతో మాట్లాడిన సందర్బంలో తమ్ముడు పవన్‌కు సలహా ఇచ్చాడు. మరి పవన్ అన్న చిరు మాట వింటాడా అనేది చూడాలి. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.
మరిన్ని వార్తలు: