Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ సినీ పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితి వాతావరణంకు ఎట్టకేలకు తెర పడ్డట్లయ్యింది. గత కొన్ని రోజులుగా తమిళ సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ కోరుతూ ఉద్యమం చేస్తున్నారు. షూటింగ్స్‌లో పాల్గొనకుండా సమ్మె చేస్తున్నారు. తమిళ సినిమా పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వారం రోజులుగా సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. దాదాపు 45 సినిమాలు షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయాయి. అందులో రజినీకాంత్ చిత్రం కూడా ఉంది.
నిర్మాతల మండలి వేతనం పెంపుకు మొదటి నుండి కూడా నో చెబుతూ వచ్చింది. ఎట్టకేకు నిర్మాతలు దిగి వచ్చి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందిన సభ్యుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతి తమిళ సినిమాలో కూడా ఖచ్చితంగా వారి సభ్యులను మాత్రమే తీసుకోవాలని, గుర్తింపు లేని వారిని షూటింగ్స్‌లకు తీసుకోవద్దని, అలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని సదరు సంఘం నిర్మాతలను హెచ్చరించింది. మొత్తానికి తమిళనాట మళ్లీ షూటింగ్స్‌తో సందడి కొనసాగుతుంది. ఈ సమ్మె సమయంలో ఫెడరేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్కే సెల్వమణి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ప్రస్తుతం నిర్మాతల మండలిలో విశాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు పెంచేది లేదు అంటూ విశాల్ తేల్చి చెప్పాడు. కాని ఇతర నిర్మాతలు ఒత్తిడి చేయడంతో కాస్త తగ్గక తప్పలేదు.
మరిన్ని వార్తలు:
దర్శకుడు…తెలుగు బులెట్ రివ్యూ.
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్