Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం వీకెండ్స్, వీక్ డేస్ అనే తేడా లేకుండా భారీ వసూళ్లను సాధిస్తుంది. మహానటికి వస్తున్న కలెక్షన్స్ చూస్తూ ట్రేడ్ వర్గాల వారు మరియు సినీ పండితులు కూడా నోరెళ్లబెడుతున్నారు. రెండు వారాల్లో ఈ చిత్రం ఏకంగా 30 కోట్ల షేర్‌ను రాబట్టింది. అన్ని వర్గాల వారిని ఈ చిత్రం ఆకర్షిస్తుంది. లాంగ్ రన్లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించడం ఖాయం అంటూ లెక్కలు చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 15 కోట్లకు, 18 కోట్లకు అమ్ముడు పోయింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పటి వరకు మహానటి శాటిలైట్ రైట్స్‌ను అమ్మలేదని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
‘మహానటి’ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను విడుదలకు ముందే అమ్మేయాలని భావించారు. కాని అప్పుడు మద్యవర్తులు బేరం కుదరనివ్వలేదు. నిర్మాతలు అనుకున్న రేటు రాకపోవడంతో సినిమా విడుదల పనుల్లో పడి శాటిలైట్ రైట్స్ అమ్మకంను పక్కకు పెట్టేశారు. ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పలువురు ఈ రైట్స్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం తెలుగు శాటిలైట్ రైట్స్‌తో పాటు తమిళ డబ్బింగ్, హిందీ డబ్బింగ్, మలయాళ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్‌ను కూడా కలిపి అమ్మేయాలని నిర్ణయించుకుంది. అన్ని భాషల రైట్స్ కొనుగోలు చేసేందుకు భారీ మొత్తం కావాలి. దాంతో మద్యవర్తులు అన్ని భాషల రైట్స్‌ను కొనేందుకు ముందుకు రావడం లేదు. సన్ నెట్వర్క్ వారు ఆసక్తిగా ఉన్నప్పటికి ప్రస్తుతం ఐపీఎల్ బిజీతో ఉన్నారు. ఆ కారణంగా శాటిలైట్ రైట్స్ అమ్మకంను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఆలస్యం చేస్తున్నా కొద్ది రేటు పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.