Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మద్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ వార్తలు రావడం సర్వ సాదారణం. గతంలో ఎన్నో వార్తలు అలా వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. కొన్ని వార్తల్లో నిజం కూడా ఉండవచ్చు. నాగచైతన్య, సమంతల గురించి వచ్చిన వార్తలు అంతా కూడా పుకార్లు అనుకున్నారు. కాని వారిద్దరు పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపర్చారు. ఇక తాజాగా అనుష్క, ప్రభాస్‌ల గురించి మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారు ఎంతగా కాదు అన్నా కూడా వారిద్దరి మద్య ఏదో ఉందని, అది పెళ్లికి దారితీస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తూ పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా నితిన్, మేఘా ఆకాష్‌ల విషయంలో కూడా ఇదే వార్త చక్కర్లు కొడుతోంది.
‘లై’ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా వీరిద్దరి రొమాన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ కాంబినేషన్‌కు ఏ హీరో కూడా ఆసక్తి చూపించడు. కాని నితిన్ తర్వాత సినిమాలో హీరోయిన్‌గా మేఘా ఆకాష్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ కారణంతోనే ఇద్దరి మద్య వ్యవహారం సాగుతుందని కొందరు ఊహాగాణాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలపై ఇటీవలే నితిన్ స్పందిస్తూ తామిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. తన పెళ్లికి సమయం ఉందని, ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని, ప్రేమించాలని కూడా లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
నితిన్‌తో ప్రేమ వార్తలపై తాజాగా ముద్దుగుమ్మ మేఘా స్పందించింది. తాను నితిన్ ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలు నవ్వు తెప్పిస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. అసలు మా ఇద్దరి మద్య ప్రేమ ఉన్నట్లుగా మీడియా వారు ఎలా భావిస్తున్నారో అర్థం కావడం లేదు. రెండు సినిమాలు వరుసగా చేస్తే ప్రేమలో ఉన్నట్లుగా ఎలా ఊహిస్తారు అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఆమె పేర్కొంది. నితిన్ మరియు మేఘా ఆకాష్‌ల మద్య వ్యవహారం జరుగుతుందని కొందరు సినీ వర్గాల వారు ఇప్పటికి అంటూనే ఉన్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి వారి ప్రేమను అంగీకరించాడు, పెళ్లికి కూడా ఓకే చెప్పాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం గురించి ఆలోచించాలని వీరు భావిస్తున్నారు. అప్పటి వరకు ఇద్దరి మద్య ఏమీ లేదని ఇద్దరు కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు.