Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
CM KCR Supports To NDA Presidential Candidate Ram Nath Kovind
రాజకీయాల్లో ఎత్తులుక పైఎత్తులు వేసే గులాబీ బాస్ కు.. ప్రముఖుల్ని బుట్టలో పడేయడం కూడా బాగా తెలుసు. ప్రణబ్ కనిపిస్తే పాదాభివందనం చేసి ఆయన మనసు గెలుచుకున్న కేసీఆర్.. ఇప్పుడు కాబోయే రాష్ట్రపతిని కాకా పడుతున్నారు. కోవింద్ గెలుస్తారని జోస్యం చెప్పడమే కాకుండా.. ఆయన్ను తెగ పొగిడేశారు. అటు కోవింద్ కూడా కేసీఆర్ ఆతిథ్యానికి ముగ్ధులైపోయారట. మొత్తం మీద కేసీఆర్ లాగా ముందరి కాళ్లకు బంధాలు వేయడం నేర్చుకోవాలని ప్రత్యర్థులు కూడా ఈర్ష్య పడుతున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య, దత్తాత్రేయతో కలిసి హైదరాబాద్ జలవిహార్ వచ్చిన కోవింద్ ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. పైగా శాలువా కప్పి మరీ సత్కరించారు. అంతటితో ఆగకుండా ఆయన ప్రొఫైల్ అంతా తానే చదివి వినిపించి, రామ్ నాథ్ కు ఏ మచ్చా లేదని, అత్యున్నత పదవికి వన్నె తెస్తారని ఆకాంక్షించారు కేసీఆర్. దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని, తెలంగాణ దేశానికి ఇంజిన్ లాంటిదని పనిలోపనిగా రాష్ట్రం గురించి కూడా గొప్పగా చెప్పారు కేసీఆర్.
కేసీఆర్ స్పీచ్ చూసి అక్కడకు వచ్చిన బీజేపీ నేతలు కూడా అవాక్కయ్యారు. కోవింద్ ను తాము కూడా ఇంత బాగా పొగడలేమని, ఎంతైనా మాటకారి కేసీఆర్ గడుసువాడేనని చెప్పుకున్నారు. కేసీఆర్ ప్రసంగం విన్నాక వెంకయ్యకు కూడా గులాబీ బాస్ పై అవగాహన పెరిగిందని, ఇకపై అందుకు తగ్గట్లుగా బీజేపీ వ్యూహాలుంటాయనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ అతి వినయం ముందస్తుగా దేనికి సంకేతమో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: