రేవంత్ హయాంలో అధికారులు జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి దుష్ప్రవర్తనతో తెలంగాణ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించిందని గుర్తుచేశారు. హెచ్‌సీయూ భూమిని విక్రయించడానికి రూ.10వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం అనాలోచిత చర్యలతో పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదం ఉందని అన్నారు. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో జరిగిన తప్పిదాలకు రేవంత్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.





