పెట్టుబడులే లక్ష్యంగా గతంలో విదేశీ పర్యటన చేసిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు మళ్లీ ఫారెన్ ఫైయిట్ ఎక్కనున్నారు. ఈసారి జపాన్ టూర్ షెడ్యూల్ కన్ఫామ్ అయింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా జపాన్ వెళ్లనున్నారు. దాదాపు ఎనిమిది రోజులపాటు జపాన్ పర్యటనలో ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు.