తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని.. అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకే సారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చానన్నారు. అలాగే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామని తెలిపారు. గాంధీ కుటుంబంతో తనకు అనుబంధం అంతకు మించి ఉందని.. ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు.