Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనిషి చనిపోయిన తర్వాత డాక్టర్ పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయాడు అనే విషయాన్ని నిర్ధారిస్తాడు, ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికల్లో ఓడితే ఆ పార్టీ అధినేత నాయకులతో మీటింగ్ పెట్టి ఏ కారణం వల్ల ఓడిపోయామో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఒక సినిమా ఫ్లాప్ అవ్వడంకు కారణం ఏంటీ అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. తాజాగా విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఫ్లాప్‌కు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కారణం ఏంటా అని విశ్లేషిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది పవన్ కళ్యాణ్‌ను పవర్‌ఫుల్‌గా చూపించక పోవడమే కారణం అంటూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.
సినీ విశ్లేషకులు కూడా ఎక్కువగా ఒక సీరియస్‌గా సాగాల్సిన రివేంజ్ డ్రామాలో సొల్లు కామెడీ పెట్టడం వల్ల సినిమా దొబ్బింది అంటున్నారు. తండ్రి తమ్ముడు చనిపోయారు. వారిద్దరిని చంపిన వారిని కనిపెట్టి వారిపై రివేంజ్ తీర్చుకోవాలనుకున్న హీరో ఎక్కడ కూడా కామెడీగా ప్రవర్తించకూడదు. చాలా సీరియస్‌గా సినిమా సాగిపోవాలి. అంతకు కామెడీ సీన్స్ కావాలని భావించినట్లయితే హీరోతో కాకుండా ఇతర నటీనటులో కామెడీ చేయాలి. అలా కాదని రివేంజ్‌తో సీరియస్‌గా ఉండాల్సిన పాత్రతోనే కామెడీ చేయించడం, అది కూడా సొల్లు కామెడీ చేయడం చాలా సోచనీయం. సైకిల్ ఎక్కడం, బెల్ట్ తీయడం, ఆడపిల్ల మాదిరిగా పవన్ పదే పదే ఏడ్వడం, హీరోయిన్స్ ఇద్దరు కలిసి పవన్‌ను కొట్టడం ఇలా చిల్లర కామెడీ సీన్స్ వల్లే సినిమాకు దెబ్బడిపోయింది అంటూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ మరియు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రివేంజ్ డ్రామాలో చిల్లర కామెడీ జొప్పించడం వల్లే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది అనేది నా కామెంట్.