యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ‘సాహో’. బాహుబలి కోసం దాదాపు అయిదు సంవత్సరాల పాటు కష్టపడ్డ ప్రభాస్ ‘సాహో’ చిత్రం కోసం కూడా రెండు సంవత్సరాలు కష్టపడుతున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పలు విదేశీ లొకేషన్స్‌లో జరుగుతుంది. దుబాయిలో దాదాపు 90 కోట్లతో భారీ యాషన్ సీన్స్‌ను చిత్రీకరించిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం స్టోరీ గురించి ఇప్పటి వరకు లీక్ కాలేదు. మొదటి సారి స్టోరీ గురించి ప్రచారం జరుగుతుంది. ఈచిత్రంలో ప్రభాస్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడట. దేశ విదేశాల్లోని అతి ప్రాచీనమైన వజ్రాలను దొంగిలించడం ప్రభాస్ పనిగా కథ సాగుతుందని సమాచారం అందుతుంది.
బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ధూమ్ చిత్రం తరహాలోనే అత్యధునిక టెక్నాలజీని ఉపయోగించి దొంగతనాలు చేయడం, ఖరీదైన బైక్‌పై ఎస్కేప్ అవ్వడం, దేశ విదేశాలు చుట్టేసి ఖరీదైన వజ్రాలను కొట్టేయడం సాహో చిత్రంలో చూపించబోతున్నారు. బాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. ఇక వజ్రాల దొంగను పట్టుకునేందుకు ప్రభాస్ స్నేహితురాలు అయిన శ్రద్దా కపూర్ పోలీస్ ఆఫసర్‌గా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక వైపు స్నేహితురాలికి దొరకకుండా, ఆమెను ఇబ్బంది పెట్టకుండా ప్రభాస్ వజ్రాలను దొంగిలిస్తూ ఉంటాడు. ఈ కథంశంతో ఆసక్తికర ప్రేమ కథను జోడిచ్చి చక్కని సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. యూవీ క్రియేషన్స్‌లో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.