Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లా పశ్చిమగోదావరి. ఇక్కడ ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేయాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. బాబు కూడా అందుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో మెగా అక్వా ఫుడ్ పార్క్ రగడ పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే భూములు కోల్పోతున్న రైతులకు బాబు సర్దిచెప్పినా.. ప్రతిపక్షాలు మాత్రం సమయం కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇప్పటికే తుందుర్రు బాధితులు సీఎం చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలు వైసీపీ, జనసేన, సీపీఎంలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ కారణంగా తమ పొలాలు పాడైపోతాయని, అక్కడి నీళ్లు కలుషితమౌతాయని, అయితే వీరికి అనుగుణంగా చంద్రబాబు మంచి ఆన్సరే చెప్పారు. ఫ్యాక్టరీ కాలుష్యం గ్రామాల్లోకి రాదని, ఒకవేళ వస్తే వెంటనే ఎత్తేస్తామని భరోసా ఇచ్చారు.
కానీ రైతుల్లో కొందరికి బాబు మాటలు నచ్చలేదు. అందుకే ఏకంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలిసి కష్టాలు చెప్పుకున్నారు. ఆయన కూడా అండగా ఉంటానని మాటివ్వడమే కాకుండా.. అవసరమైతే తుందుర్రులో పర్యటిస్తానని చెప్పడంతో బాధితులతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆనందంగా ఉన్నారు. రాహుల్ వస్తే తమకు ఊపొస్తుందని వాళ్లు భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు