Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Congress Leader Kotla Surya Praksh Reddy Wants To Join YSRCP Party
గతంలో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినప్పుడు అందరూ ఫెయిల్యూర్ లీడర్స్ ను తీసుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఓ పార్టీలో సక్సెస్ కాలేని వాళ్లు అక్కడ మాత్రం ఏం ఉద్ధరిస్తారని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా అదే పని చేస్తున్నారట. త్వరలోనే కోట్ల కుటుంబం వైసీపీ జెండా కప్పుకోనుందట. తరతరాలుగా కాంగ్రెస్ కు విధేయులుగా ఉన్న కోట్ల కుటుంబ సభ్యులు.. మారిన పరిస్థితుల్లో జగన్ పంచన చేరాలని తహతహలాడుతున్నారు.
జగన్ ది, తమది ఒకే సామాజిక వర్గం కావడం, మంచి గౌరవం ఉంటుందని హామీ లభించడంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారట. గతంలో వైఎస్ తో కూడా కొంత మంచి సంబంధాలే మెయింటైన్ చేశారాయన. ఆ యాంగిల్లో కూడా జగన్ తో ఉంటే మచిందని అనుకుంటున్నారట. మరి సామాజిక సమీకరణాలు చూసుకుని వైసీపీలో చేరితే.. భవిష్యత్ మారుతుందా అనేది మాత్రం ఓటర్లే నిర్ణయించాలి. సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకను కాదని కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తారా.. లేదంటే మరో స్థానం ఇస్తారా అని వైసీపీలో చర్చ జరుగుతోంది.
కోట్ల కుటుంబానికి డోన్, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కాస్త పట్టుంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఓడిపోయారు. ఈసారి కొడుకును రంగంలోకి దించాలనుకుంటున్నారు. అందుకే వైసీపీలో చేరాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తుందిట. జగన్ కు యువనేతల అవసరం ఉందని, అక్కడకు వెళ్తే కోట్ల కుమారుడు ఎదగడానికి అవకాశాలుంటాయని భావిస్తున్నారు. దీంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, సతీమణి సుజాతమ్మ, కొడుకు రాఘవేంద్రరెడ్డితో కలిసి జగన్ పార్టీలోకి జంప్ కావాలని చూస్తున్నారు కోట్ల.
మరిన్ని వార్తలు: