Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, సమీకరణాలు క్షణ క్షణానికి మారుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. బీజేపీకి క్లియర్ మెజారిటీ తో మొదలయిన ఫలితాల ట్రెండ్స్ క్షణక్షణానికి మారిపోతు హంగ్ అసెంబ్లీ ఖాయమని తేలడంతో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. దీంతో గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామో లేదోనన్న భయం బీజేపీ నేతలకి పట్టుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 112 ను అందుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకంగా మారింది. దీంతో దాదాపు 75 సీట్లకు పైగా సాధించే అవకాశం ఉన్న కాంగ్రెస్ కర్ణాటకలో అధికారాన్ని బీజేపీకి దక్కకుండా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అలా చేయడంలో సఫలమయ్యింది.
ఇందుకోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా జేడీఎస్ అధినేత దేవెగౌడకు ఫోన్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌కి మద్దతిచ్చే అంశంపై తాను కుమారస్వామితో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పిన దేవేగౌడ కొద్ది క్షణాల క్రితమే కాంగ్రెస్ ఆఫర్ ని ఒకే చేసినట్లు తెలుస్తుంది. దేవెగౌడ నివాసానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేరుకోగా. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలువనున్నారని సమాచారం. దీంతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.