తమిళ్ లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా బాల దర్శకత్వంలో అర్జున్ రెడ్డిని వర్మ టైటిల్ తో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసారు. టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఊహించని విధంగా సినిమాని ఆపేసారు. మేకింగ్, క్వాలిటీ పరంగా సినిమా ఏ మాత్రం బాగోలేదని స్వయంగా నిర్మాణ సంస్థే ప్రకటించి దర్శకుడితోపాటు, మిగతా టెక్నీకల్ టీమ్ ను కూడా మార్చేస్తున్నట్లు వెల్లడించింది. మరి రిలీజ్ కు వచ్చే వరకూ ప్రొడక్షన్ హౌస్ ఎందుకంత యేమరపాటుగా? ఉందంటూ సర్వత్రా విమర్శల పర్వం మొదలైంది. బాలకిది పెద్ద అవమానం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోది.
సదరు సంస్థ ఉన్నట్లుండి ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఎవరని ఆరా తీయగా విక్రమ్ ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలు విక్రమ్ చూసి సినిమా చూసి బాగోలేదని నిర్మోహమాటంగా చెప్పేశాడట. ఈ సినిమా మర్కెట్ లోకి వెళ్తే తన కోడుకుతో పాటు, తన ఇమేజ్ కి డ్యామేజ్ తప్పదని నిర్మాణ సంస్థతో వారించి నమ్మి చేతుల్లో పెడితే ఇలాంటి సినిమా చేస్తారా అని సీరియస్ అయ్యాడుని ఫలితంగా బాల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటననిచ్చినట్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా మొత్తం వేరే దర్శకుడ్ని పెట్టి మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించారు.