గోపీచంద్ సినిమా పై క్రేజీ రూమర్ ?

గోపీచంద్ సినిమా పై క్రేజీ రూమర్ ?
Movie News

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. గోపీచంద్ తో శ్రీను వైట్ల చేస్తున్న కథా నేపథ్యం పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో నే సాగుతుందని, మెయిన్ కథాంశమే నీరు చుట్టూ ఉంటుందని.. మొత్తానికి గోపీచంద్ – శ్రీను వైట్ల నుంచి పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని తెలుస్తుంది . అలాగే, శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా మూవీ లో ఫుల్ గా ఉంటాయట.

గోపీచంద్ సినిమా పై క్రేజీ రూమర్ ?
Gopichand

కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాతో ఈ ఐటమ్ సాంగ్ ని చేపిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా ని చిత్రాలయం స్టూడియోస్ సంస్థ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించాల్సి ఉన్నది. అన్నట్టు ఈ సినిమా కి విశ్వం అనే టైటిల్ ని యూనిట్ పరిశీలసిస్తోందట. స్క్రిప్ట్ కి తగ్గట్లుగా ఈ టైటిల్ సరిపోతుందని అంటున్నారు.