Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్‌బాస్ వల్ల హరితేజకు ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ దక్కింది. బిగ్‌బాస్ సీజన్ 1 లో విన్నర్‌గా నిలువలేక పోయినా కూడా హరితేజ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విషయం తెల్సిందే. బిగ్‌బాస్ పూర్తి అయిన తర్వాత హరితేజకు ఒక్కసారిగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఒక వైపు సినిమాల్లో మరో వైపు సీరియల్స్ రియాల్టీ షోల్లో కూడా హరితేజకు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా దీపావళి సందర్బంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంకు శివారెడ్డితో కలిసి హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ కార్యక్రమంలో ఈమె కాస్త అతిగా ప్రవర్తించిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఆ కార్యక్రమంను ఒక సినిమా వేడుక మాదిరిగా, ఒక జబర్దస్త్ షో మాదిరిగా చేసింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శివారెడ్డితో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు, కాస్త అతి ఉత్సాహంతో మాట్లాడటం వంటివి చేసిందని కార్యక్రమంలో పాల్గొన్న వారు చెబుతున్నారు. సమయస్ఫూర్తితో మరియు ఓపికతో హరితేజ షోలకు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని, ఆ కారణంగానే హరితేజ ఆకట్టుకోలేక పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి. త్వరలోనే ఈటీవీలో ప్రసారం కాబోతున్న ఒక రియాల్టీ షోకు హరితేజ హోస్ట్‌గా కనిపించబోతుంది. ఆ షో ఏంటీ అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.