Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పలువురు తమిళ హీరోలు తెలుగులో స్టార్డంను దక్కించుకున్నారు. వారి ప్రతి సినిమా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. కాని ధనుష్ మాత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఆయన నటించిన ‘వీఐపీ’ చిత్రం తెలుగులో ‘రఘువరన్ బిటెక్’గా విడుదలైంది. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం మినహా ధనుష్‌కు తెలుగులో పెద్దగా సక్సెస్‌లు ఏమీ లేవు. ఇప్పుడు మళ్లీ ‘వీఐపీ’ చిత్రానికి సీక్వెల్ చేయడం జరిగింది. మొదటి పార్ట్ తెలుగులో మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఇటీవల తెరకెక్కిన సీక్వెల్‌ను కూడా తెలుగులో భారీగా విడుదల చేయాలని భావించారు.
ఈనెల 11న తమిళంలో విడుదల చేయగా, అదే రోజు తెలుగులో కూడా విడుదల చేయాలని భావించారు. కాని తెలుగులో అదే రోజు మూడు పెద్ద చిత్రాలు విడుదలున్న నేపథ్యంలో ‘వీఐపీ 2’ను వాయిదా వేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ‘వీఐపీ 2’ కోసం భారీగా పబ్లిసిటీ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా విడుదల కాకపోవడంతో ఆ పబ్లిసిటీ అంతా వృదా. గత వారం విడుదలై ఘన విజయం సాధించిన ‘వీఐపీ 2’ చిత్రానికి మరో సీక్వెల్‌ను చేస్తాను అంటూ ధనుష్ ప్రకటించాడు. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు మొదలు పెడతాను అన్నాడు. కాని తెలుగులో విడుదల ఎప్పుడు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. తెలుగు ప్రేక్షకులు ‘వీఐపీ 2’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వార్తలు:
పైసావసూల్ లో బాలయ్య న్యూలుక్
