కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటైన ధరణి పోర్టల్, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసి, సూపర్ పాపులర్ స్కీమ్‌గా మారిపోయింది. కానీ.. నిర్వహణా లోపాలు, అవకతవకలు, కొందరి చేతివాటం.. అన్నీ కలిపి ధరణి చట్టాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చేశాయి. దాన్నే ఆసరాగా చేసుకుని, ధరణికి ప్రత్యామ్నాయం పేరుతో జనంలోకెళ్లి రాజకీయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కొట్టింది. అధికారంలోకి వచ్చీరాగానే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటి వేసి.. ధరణిలో లొసుగుల్ని పసిగట్టి.. కొత్త చట్టం భూభారతి రూపకల్పనకు నడుంకట్టింది రేవంత్ సర్కార్.




