Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో… మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. భార్యతో పాటు బీసీసీఐ, మీడియా షమీని నిందితునిగా చూస్తుండగా… షమీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ధోనీ మాత్రం… అతనికి అండగా నిలిచాడు. తనకు తెలిసినంతమేరకు షమీ అలాంటి వాడు కాదని ధోనీ చెప్పాడు. ఇది షమీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని, దీనిపై తాను వ్యాఖ్యానించకూడదని అన్నప్పటికీ… తన అభిప్రాయం వెల్లడించాడు.
తనకు తెలిసి షమీ గొప్ప వ్యక్తని, అతను భార్యను, దేశాన్ని వంచించడని ధోనీ విశ్వాసం వ్యక్తంచేశాడు. రెండురోజుల క్రితం మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు కపిల్ దేవ్ కూడా ఇదేరకమైన అభిప్రాయం వ్యక్తంచేశాడు. అటు షమీ కేసును విచారిస్తున్న కోల్ కతా పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు. ఇంతకుముందే పెళ్లిచేసుకున్న అమ్మాయిని కలవడానికి షమీ దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత దుబాయ్ వెళ్లినట్టు భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలపై బీసీసీఐని వివరణ అడిగారు. షమీ దుబాయ్ వెళ్లడంపై సమాచారం ఉంటే… దానికి సంబంధించిన వివరాలు చెప్పాలని లేఖలోకోరారు. `