Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో దిల్‌రాజుకు అరుదైన గుర్తింపు ఉంది. ఈయన నిర్మించే సినిమాలు, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల్లో మ్యాటర్ ఉంటుందని, ఖచ్చితంగా ఆ సినిమాలు ఆకట్టుకుంటాయనే తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సినీ వర్గాల్లో కూడా దిల్‌రాజు జడ్జ్‌మెంట్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆ మద్య దిల్‌రాజు నిర్మించిన ప్రతి సినిమా, డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ అయ్యాయి. ఆయనకు లాభాలు తెచ్చి పెట్టాయి. కాని ప్రస్తుతం దిల్‌రాజు అంచనా తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు సక్సెస్, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
చాలా నమ్మకంగా తీసుకుంటున్న సినిమాలు దిల్‌రాజుకు నష్టాలను మిగుల్చుతున్నాయి. ఆ మద్య నాగార్జున, రాఘవేంద్ర రావుల కాంబినేషన్లో వచ్చిన ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా వల్ల దిల్‌రాజుకు భారీగానే నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ కొన్ని సినిమాలతో సక్సెస్‌లు దక్కించుకున్నాడు. తాజాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘గౌతమ్‌నంద’ చిత్రాన్ని నైజాం ఏరియాకు గాను పంపిణీ చేయడం జరిగింది. సినిమాకు పాజిటివ్‌గా స్పందన వచ్చినా కూడా లాభాలను మాత్రం తెచ్చి పెట్టలేక పోయింది. ఇక తాజాగా విడుదలైన ‘దర్శకుడు’ సినిమా హక్కులు కూడా దిల్‌రాజు తీసుకున్నాడు. దర్శకుడు సినిమా కూడా దిల్‌రాజుకు నష్టాలను మిగిల్చేలా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు దిల్‌రాజు ‘లై’ మరియు ‘జయ జానకి నాయక’ చిత్రాలను నైజాం ఏరియాలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. మరి ఈ రెండు సినిమాలైన దిల్‌రాజుకు సక్సెస్‌ను, లాభాలను తెచ్చి పెడతాయా అనేది చూడాలి. ఈయన మరో వైపు నిర్మాతగా సక్సెస్‌లు దక్కించుకుంటున్నాడు.
మరిన్ని వార్తలు: