Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రానికి ముందు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ‘ఓనమాలు’ మరియు ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్‌ను కూడా రాబట్టాయి. కాని సునీల్ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అందుకే సునీల్‌తో క్రాంతి మాధవ్ చేసిన సినిమాకు ప్రేక్షకుల్లో ఆధరణ దక్కడం కష్టమే అని భావిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. సినిమా పూర్తి అయ్యి ఆరు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు విడుదలు నోచుకోవడం లేదు.సినిమాను బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో నిర్మాతలు దిల్రాజును ఆశ్రయించారు.
దిల్‌రాజు ఈ సినిమాకు చిన్న చిన్న రీ షూట్లు చెప్పడంతో పాటు, సినిమాకు కీలకమైన వాయిస్ ఓవర్‌ను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దిల్‌రాజు వాయిస్‌తో ‘ఉంగరాల రాంబాబు’ సినిమా ప్రారంభం అవుతుంది. సినిమా ఆరంభం నుండి చివరి వరకు కూడా దిల్‌రాజు గొంతు అప్పుడప్పుడు సినిమాలో వినిపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో దిల్‌రాజు వేలు పెట్టడంతో సినిమా స్థాయి పెరిగి పోయింది. దిల్‌రాజుపై నమ్మకంతో ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారు. ఈనెల 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, సినిమాకు దిల్‌రాజు వాయిస్ ఏమైనా ఉపయోగపడుతుందా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: