Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేష్‌బాబు రెండు వరుస చిత్రాలతో డిజాస్టర్లను చవి చూశాడు. ఆ తర్వాత వచ్చిన ‘భరత్ అనే నేను’ మంచి విజయాన్ని దక్కించుకోవడంతో మహేష్‌బాబు ఊపిరి పీల్చుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను టాలీవుడ్ టాప్ చిత్రాల సరసన నిలిచింది. భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన ఆ చిత్రం మహేష్ కెరీర్లో నిలిచి పోయింది. అంతటి భారీ విజయం తర్వాత అభిమానులు అంతే స్థాయి సినిమాను కోరుకుంటారు. అందుకే మహేష్‌బాబు తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. మహేష్‌బాబు 25వ చిత్రంతో రాబోతున్నాడు.
మహేష్‌బాబు 25వ చిత్రం ఆరు నెలల క్రితమే ఫైనల్ అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు నిర్మించబోతున్నారు. భరత్ అనే నేను చిత్రం తర్వాత మహేష్‌బాబు ప్రయోగాలు చేసేందుకు భయపడుతున్నాడు. అందుకే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాను కాస్త పక్కకు పెట్టాలని భావిస్తున్నాడు. 26వ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సి ఉంది. కాని అంతకు ముందే అంటే 25వ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తుంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తే తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందని, ప్రతిష్టాత్మక 25వ చిత్రంతో ప్రయోగాలు చేసే కంటే సుకుమార్‌తో చేయడం బెటర్ అనే నిర్ణయానికి మహేష్ వచ్చినట్లుగా తెలుస్తోంది.