డిస్ట్రిబ్యూటర్‌గా మారుతి డిజాస్టర్స్‌

Director Maruthi Open Heart With Rk

దర్శకుడు మారుతి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన తాజాగా శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం భారీ అంచనాల నడుమ రూపొంది వినాయక చవితి సందర్బంగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో మారుతి స్థాయి మరింతగా పెరిగింది. ప్రస్తుతం దర్శకుడిగా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను కొనసాగిస్తున్న దర్శకుడు మారుతి గతంలో డిస్ట్రిబ్యూటర్‌గా పలు డిజాస్టర్స్‌ను చవిచూసినట్లుగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఈయన ఏబీఎస్‌ రాధాకృష్ణ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే షోలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

maruthi and arya

సినిమా పరిశ్రమలో తాను డిస్ట్రిబ్యూటర్‌గా ఎంటర్‌ అయ్యాను. ‘ఆర్య’ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ వారితో కలిసి డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ఆ చిత్రం మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అయితే ఆ తర్వాత పంపిణీ చేసిన ‘హ్యాపీ’, ‘మహా’, ‘నందనవనం 120 కిమి’ చిత్రాలు దారుణమైన నష్టాలను మిగిల్చాయి. అప్పటి నుండి సినిమాలు పంపిణీ చేసేందుకు భయమేస్తోంది అంటూ ఈ సందర్బంగా మారుతి చెప్పుకొచ్చాడు. వరుసగా చిత్రాలు దర్శకత్వం చేస్తూ ఉన్న మారుతి నిర్మాతగా కూడా కొనసాగుతున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రాబోతున్న తర్వాత చిత్రంపై త్వరలోనే క్లారిటీ రాబోతుంది.

Director Maruthi New film