Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘నా పేరు సూర్య’ చిత్రంతో దర్శకుడిగా మారిన రచయిత వక్కంతం వంశీ ప్రేక్షకులను నిరాశ పర్చాడు. అల్లు అర్జున్‌తో ఈయన ఒక పవర్ ఫుల్ సినిమాను తెరకెక్కించి, కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈయన తెరకెక్కించిన నా పేరు సూర్య చిత్రం మెప్పించలేక పోయింది. దానికి తోడు ఈసినిమా కథలో పలు లాజిక్స్ మిస్ అయ్యాయి. చిన్న చిన్న విషయాల్లో దర్శకుడు లాజిక్ ఫాలో అవ్వక పోవడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది. ముఖ్యంగా హీరో, ఆయన తల్లి మద్య సీన్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్నతనంలో మిస్ అయిన కొడుకు ఎన్నేళ్లకు కనిపించినా కూడా కన్న ప్రేగు కనుక గుర్తు పడుతుంది. కాని ఈ చిత్రంలో 15 ఏళ్ల వయస్సులో ఇంట్లోంచి వెళ్లి పోయిన కొడుకు కొన్ని సంవత్సరాల తర్వాత కళ్ల ముందుకు వచ్చినా ఆమె గుర్తు పట్టదు. సినిమాలో తల్లి పాత్రను చాలా దారుణంగా దర్శకుడు చూపించాడు. తల్లి కొడుకుల మద్య సీన్స్‌పై అసలు దృష్టి పెట్టినట్లుగా అనిపించలేదు. దాంతో సినిమాపై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఇదే విషయమై దర్శకుడు వంశీ మాట్లాడుతూ చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయిన మాట వాస్తవమే. నా స్నేహితుడు కాల్ చేసి తల్లి కొడుకును గుర్తు పట్టక పోవడం ఏంటని ప్రశ్నించినప్పుడు నన్ను చెప్పుతో కొట్టినట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాను చేసిన తప్పుకు క్షమించాలి, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను అంటూ చెప్పుకొచ్చాడు.