నువ్వు నాక‌న్నా పిచ్చోడివి

Director-varma-Reacts-on-MM

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ పై చెల‌రేగిన వివాదాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే… ఈ సినిమా డైరెక్ట‌ర్ వ‌ర్మ‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం. కీర‌వాణి మాత్రం ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించుకుంటున్నారు. పోర్న్ సినిమాకు మ్యూజిక్ అందించ‌డంపై వ‌చ్చిన విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోకుండా… వ‌ర్మ‌ను కీర‌వాణి ట్విట్ట‌ర్ లో పొగిడిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ తెలివితేట‌లు త‌న‌ను ఓ మెట్టు ఎక్కించాయ‌ని కీర‌వాణి వ్యాఖ్యానించారు.

1991లో రొమాన్స్ ను, 1992లో కామెడీని, 2018లో సెక్స్ కు సంగీతం అందించాన‌ని, ఈ ఏడాదిలో వ‌ర్మ తీస్తున్న హార‌ర్, వ‌యొలెన్స్ చిత్రాల‌కు సంగీతం అందించ‌బోతున్నాన‌ని, త‌న‌ను న‌మ్మిన పిచ్చి ద‌ర్శ‌కుడికి థాంక్స్ అని కీర‌వాణి ట్వీట్ చేయ‌గా… వ‌ర్మ త‌న‌దైన స్ట‌యిల్ లో రియాక్ష‌న్ ఇచ్చారు. కీర‌వాణిని ఉద్దేశిస్తూ నువ్వు నాక‌న్నా పిచ్చోడివి. నీలాంటి పిచ్చి జీనియ‌స్ మాత్ర‌మే క్ష‌ణ‌క్ష‌ణం నుంచి అన్న‌మ‌య్య‌కు…అక్క‌డి నుంచి బాహుబ‌లికి…అక్క‌డి నుంచి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కు జంప్ కాగ‌ల‌రు అని ట్వీట్ చేశారు.