అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు దాదాపు ఆరు నెలలు వెయిట్ చేసిన విక్రమ్ కుమార్ చివరకు మరో హీరోను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కథలో పలు మార్పులు చేర్పులు చేయించిన బన్నీ చివరకు త్రివిక్రమ్‌తో మూవీ అంటూ వెళ్లి పోయాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఇప్పటికే బన్నీ రెండు సినిమాలు చేసి ఆ రెండు సక్సెస్‌లను దక్కించుకున్నాడు. ఇప్పుడు మూడవ సినిమాతో సక్సెస్‌కు సిద్దం అవుతున్నాడు.
ఇలాంటి సమయంలో విక్రమ్ కుమార్ మూవీని వాయిదా వేశాడు. త్రివిక్రమ్‌తో మూవీ చేసిన తర్వాత నీతో చేస్తానంటూ నిర్మొహమాటంగా విక్రమ్ కుమార్‌తో బన్నీ చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అప్పటి వరకు కథను మరింత బాగా రెడీ చేయమని చిన్న సలహా కూడా విక్రమ్‌కు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. దాంతో విక్రమ్‌కు తీవ్రంగా ఆగ్రహం కలిగిందని, ఆరు నెలలుగా తిప్పించుకుని ఇప్పుడు తర్వాత అంటూ త్రివిక్రమ్‌తో మూవీకి సిద్దం అవ్వడం ఏంటీ అంటూ బన్నీపై విక్రమ్ కోపంతో ఉన్నాడు.
బన్నీతో మూవీ ఆలస్యం అంటూ తేలిపోవడంతో వెంటనే విక్రమ్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని నానితో చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న జెర్సీ చిత్రాన్ని చేస్తున్న నాని ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలోనే సినిమా రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల అప్పుడు సినిమా వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు సినిమా గురించి చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఆ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ‘జెర్సీ’ చిత్రం తర్వాత నాని, విక్రమ్ కుమార్ల మూవీ పట్టా లెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. విక్రమ్ కుమార్ చాలా విభిన్నమైన కథలతో సినిమాలను చేస్తాడు. మనం, 24 వంటి చిత్రాలు విక్రమ్ కుమార్ స్థాయిని అమాంతం పెంచేశాయి. తప్పకుండా నానికి ఆయన ఒక మంచి సినిమాను ఇస్తాడనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.