అల్లుడు డిస్ట్రిబ్యూటర్లు మునగాల్సిందేనా…?

Distributors Heavy Losses In Sailaja Reddy Alludu Movie

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. 18 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చేసిన ఈ చిత్రం అంత మొత్తంలో రాబట్టడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో మొదటి మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత రోజు నుండి ఏమాత్రం వసూళ్లను రాబట్టలేక పోతుంది. తెలుగు రాష్ట్రాతో పాటు, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం ఏమాత్రం వసూళ్లను సాధించలేక పోతుంది.

maruthi

అయిదు రోజులు పూర్తి అయ్యే సమయానికి ఈ చిత్రం కేవలం 11.5 కోట్లను మాత్రమే దక్కించుకుంది. డిస్ట్రిబ్యూటర్లు బయట పడాలి అంటే ఇంకా ఆరు కోట్ల షేర్‌ను ఈ చిత్రం దక్కించుకోవల్సి ఉంది. కాని లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం మరో కోటి లేదా కోటిన్నర వరకు మాత్రమే వసూళ్లు సాధించే అవకాశం ఉందని, అంతుకు మించి రాబట్టే ఛాన్స్‌ లేదు కనుక సినిమా డిస్ట్రిబ్యూటర్లుకు ఖచ్చితంగా అయిదు కోట్లకు పైగా నష్టాలను మిగల్చబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం మరీ దారుణంగా ఫలితం ఉంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్‌ రెండు కోట్ల మేరకు నష్ట పోనున్నట్లగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. మారుతిపై నమ్మకంతో భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు తల పట్టుకున్నారు.

nag-chaitanya