Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మధ్య వెంకటేష్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. గత కొన్ని నెలలుగా సినిమాలేవి కమిట్ కాని వెంకీ తాజాగా తేజ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో దర్శకుడిగా చాలా కాలంకు సక్సెస్‌ను దక్కించుకున్న తేజ ఈ చిత్రంతో వెంకీతో మరో సక్సెస్‌ను దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను అతి త్వరలోనే సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా శ్రియను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే సినిమాలో మరో హీరోయిన్ను కూడా నటింపజేసేందుకు దర్శకుడు తేజ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మద్య కాలంలో చిన్న చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఇషా రెబ్బాను వెంకీ చిత్రంకు గాను తేజ ఎంపిక చేయడం జరిగింది. సీనియర్ హీరోతో ఇషా నటించేందుకు ఒప్పుకోవడం అందరికి షాకింగ్‌గా ఉంది. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో వెంకీతో ఇషా రొమాంటిక్ సీన్స్ ఉండవని, ఆమెకు ఒక ముఖ్యమైన పాత్ర మాత్రమే సినిమాలో ఉంటుందని, పూర్తి స్థాయి హీరోయిన్ కాదని తెలుస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడం వల్లే ఇషా ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంతో ఇషా యువ హీరోలతో నటించే ఛాన్స్‌లు కూడా దక్కించుకునే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు.