Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగినా..బాహుబలితో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నా…అనుష్క ఎప్పుడూ సింపుల్ గానే ఉంటుంది. మామూలు వ్యక్తుల మాదిరిగానే బయట ప్రవర్తిస్తుంటుంది. తాజాగా అనుష్క సాధారణ భక్తురాలిలా…పవిత్ర కేదారనాథ్ ఆలయానికి కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి శివుడిని దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. తిరుగు ప్రయాణంలో 17 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు మాత్రం అనుష్క గుర్రం ఎక్కింది. అయితే..చుట్టూ ఎలాంటి మందీమార్బలం లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులతో కలిసి..సాధారణ దుస్తుల్లో సింపుల్ గా వచ్చిన అనుష్క కేదారనాథ్ లో భక్తులు పెద్దగా గుర్తుపట్టలేదు.
కొద్దిమంది మాత్రమే అనుష్కను గుర్తించి, ఆమెను పలకరించారు. గుర్తుపట్టిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. బ్లూకలర్ కోట్ లో ఉన్న అనుష్కతో సెల్ఫీలు దిగిన వారు బాహుబలి హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేశారు.