ఎన్టీఆర్‌ వచ్చుంటే బాగుండేది

Fans Hurt With Junior NTR Absence In Balakrishna NTR Biopic Launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘ఎన్టీఆర్‌’ చిత్రం ప్రారంభోత్సవంకు నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా తరలి వస్తారని అంతా ఆశించారు. కాని కుటుంబ సభ్యులు పెద్దగా హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్‌ కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణతో పాటు ఆయన కొడుకు కళ్యాణ్‌ రామ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంకు హాజరు అవుతారని అంతా భావించారు. కాని నందమూరి ఫ్యామిలీ నుండి పెద్దగా ఎవరు హాజరు కాకపోవడంతో అక్కడ కాస్త చర్చ కూడా జరిగినట్లుగా సమాచారం అందుతుంది. ‘ఎన్టీఆర్‌’ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంకు యంగ్‌ టైగర్‌ను ఆహ్వానించి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్‌కు దూరం పెరుగుతూ వస్తుంది. ఎన్టీఆర్‌ కూడా తన బాబాయి విషయంలో అంటి ముట్టన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. బాలయ్య దురుసుతనం వల్లే ఎన్టీఆర్‌ దూరంగా ఉంటున్నట్లుగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఈ కార్యక్రమంకు అయినా నందమూరి ఫ్యామిలీ అందరితో పాటు ఎన్టీఆర్‌ను ఆహ్వానించి ఉంటే బాగుండేదని, పెద్దాయన ఆత్మ సంతోషించేది అంటూ నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అన్నగారి ఫ్యామిలీ అంతా ఒక్క చోట కలిసి చాలా ఏళ్లు అయ్యిందని, ఇదో మంచి అవకాశంగా అంతా భావించారు. కాని బాలయ్య మాత్రం ఈ కార్యక్రమంలో ఫ్యామిలీని ఇన్వాల్వ్‌ చేయలేదు.