Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన బాధిత ఏపీకి ప్రత్యేక కేటాయింపులేమీ చేయకుండానే కేంద్ర ప్రభుత్వం తమ చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ను సమర్పించింది. నాలుగేళ్లగా కేంద్రసాయం కోసం ఎదురుచూస్తున్న ఏపీకి ఈ బడ్జెట్ లోనూ నిరాశ తప్పలేదు. అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ కు అరకొర కేటాయింపులతోనే సరిపుచ్చారు. కేంద్రం బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో ఏపీ కి దక్కినవి ఇవే.
విశాఖ పోర్టుకు రూ. 108 కోట్లు
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ. 32 కోట్లు
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ. 10 కోట్లు
గిరిజన విశ్వవిద్యాలయానికి రూ. 10 కోట్లు
ఎన్ ఐటీకి రూ. 54 కోట్లు
ఐఐటీకి రూ. 50కోట్లు
ట్రిపుల్ ఐటీకి రూ. 30కోట్లు
ఐఐఎంకు రూ. 42 కోట్లు
ఐఐఎస్ సీ ఆర్ కు రూ. 49కోట్లు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కు రూ. 19.62 కోట్లు
మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ లో హైదరాబాద్ ఐఐటీకి రూ. 75కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ. 10 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం