అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘గీతాగోవిందం’ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఇటీవలే ‘గీతాగోవిందం’ పైరసీ బారిన పడింది. దీని మీద స్పందించిన అరవింద్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోలను బయటపెట్టాడని ఫ్రెండ్లీగా వాటిని అతని ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వల్ల అవి అలా అలా 17మందికి చేరాయని. తప్పని పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఇది వాళ్లు తెలియక చేసినా పెద్ద క్రైమ్ అని అరవింద్ అన్నారు.
ఈ పైరసీ వ్యవహారంలో ఇండస్ట్రీ సిగ్గు పడాలన్నారు అరవింద్. గీత గోవిందం మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు ఇలాగే పైరసీ చేశారని, పెద్ద సినిమాల క్లిప్పింగ్స్ కూడా లీకవుతున్నాయని తెలిసి భయమేస్తోందని దయచేసి ఇలాంటి చేయకండని అరవింద్ కోరారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేతుల్లో తన్నులు తినొద్దు.. అంటే ఫ్యాన్స్‌ను కొట్టమని చెప్పడం లేదని కానీ ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడతామో అర్థం చేసుకోవాలన్నారు అరవింద్. పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశామని వారు చర్య తీసుకుంటారని వెల్లడించారు.