ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి, కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి, కొన్ని చోట్ల రోడ్డు మార్గం తెగిపోయింది.
భద్రాచలం వద్ద రెండో ప్రమాదకర స్థాయికి మించి నది ప్రవహిస్తోంది. గురువారం ఉదయం నదిలో 13.49 క్యూసెక్కుల ప్రవాహంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 51.6 అడుగులకు చేరింది.
నీటిమట్టం పెరగడంతో దిగువన ఉన్న గ్రామాలు జలమయమయ్యాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలం (బ్లాక్‌లు) వరకు రోడ్డు మార్గాలు తెగిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పేరూరు వద్ద గోదావరికి తీవ్ర వరదలు పోటెత్తుతున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.
మరోవైపు కృష్ణా నది మీదుగా శ్రీశైలం వద్దకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ జూరాల, సుంకేశాల నుంచి డ్యామ్‌కు 3.88 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. నీటిని దిగువకు విడుదల చేసేందుకు శ్రీశైలం 10 గేట్లను 12 అడుగుల ఎత్తు వరకు తెరిచారు అధికారులు.
నాగార్జున సాగర్‌లోని 10 క్రెస్ట్ గేట్లను కూడా నీటిపారుదల శాఖ అధికారులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌కు 2.37 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.80 అడుగులుగా ఉంది.
నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.30 టీఎంసీలుగా ఉంది.