Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గూర్ఖాలాండ్ ఉద్యమం తెలంగాణ బాటలో నడుస్తోంది. గతంలో కోదండరాం అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు పాటించాలని బిమల్ గురుంగ్ డిసైడయ్యారు. అందుకే కోదండను సలహాలు అడుగుతున్నారట. దీనికి తోడు గతంలో మేం మీకు ఉద్యమంలో అండగా ఉన్నాం కాబట్టి.. ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నారు గూర్ఖాలాండ్ నేతలు.
ఇటు కోదండరాం కూడా గూర్ఖాలాండ్ సూచనకు ఓకే చెప్పారట. తాము గతంలో అవలంబించిన స్ట్రాటజీని గూర్ఖాలాండ్ వాసులకు వివరించారట. గూర్ఖాలాండ్ పరిధిలో ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకుని కలిసికట్టుగా ఉద్యమించాలని, గూర్ఖాలాండ్ వస్తేనే సమస్యలు తీరతాయన్న రేంజ్ లో ప్రచారం చేయాలని చెప్పారట కోదండరాం. గూర్ఖాలాండ్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువతను ఆకట్టుకోవాలని సూచించారు.
కానీ కోదండరాం ఒక్కరే తెలంగాణ సాధించలేదు. ఆయన వెనుక కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ సాధన దిశగా వ్యూహాత్మక ఉద్యమం చేసిన కేసీఆర్ ను సలహాలు అడగకుండా.. ఇప్పుడు కోదండను పట్టుకుంటే ఏమీ ఒరగదంటున్నారు టీఆర్ఎస్ వర్గాలు. అదేమంటే కోదండకు అంత సీన్ లేదని, ఆయన చెప్పిన విషయం ఫాలో అయితే.. అయినట్లే అంటున్నాయి గులాబీ వర్గాలు.
మరిన్ని వార్తలు: