టాలీవుడ్ యంగ్ నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్త ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. మే 10వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ కు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది . సీఎంని ఎందుకు చంపాలనుకున్నావ్.. నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటూ ఒక వ్యక్తి నారా రోహిత్ ని ప్రశ్నించడంతో ట్రైలర్ మొదలైంది. ప్రతోడు కెమెరా ఒకటి కొనేయడం.. వీడియోలు చేసేయడం.. యూట్యూబ్ ఛానెల్లో పెట్టేయడం అని అంటూ రఘుబాబు చెప్పిన డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయి.. మనల్నెవడు ఏం చేస్తాడు అంటూ ఈ మూవీ లో ఓ పాత్ర చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. దేశాన్ని కాపాడటానికి ఒక సైనికుడు.. కడుపు నింపడానికి ఒక రైతు ఎంత ఇంపార్టెంటో.. సొసైటీకి జర్నలిస్టు కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటూ నారా రోహిత్ చెప్పిన డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది .