Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్యానర్ : శ్రీ బాలాజీ సినీ మీడియా
నటీనటులు : గోపి చంద్ , హన్సిక , కేథరిన్
నిర్మాత : జె. భగవాన్ , పుల్లారావు
దర్శకత్వం : సంపత్ నంది
స్క్రీన్ ప్లే : సంపత్ నంది
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
ఎడిటర్ : గౌతమ్ రాజు
సినిమాటోగ్రఫీ : సౌందర్రాజన్
హీరో గోపీచంద్ , దర్శకుడు సంపత్ నంది కెరీర్ కి అగ్ని పరీక్ష నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గౌతమ్ నంద. ఓ కధలో నుంచి ఓ ఫిలాసఫీ పుడుతుంది. కొన్ని సందర్భాల్లో ఓ ఫిలాసఫీ నుంచి ఓ కధని పుట్టిస్తుంటారు దర్శకులు. అయితే ముందుగా అనుకున్న పాయింట్ చుట్టూ బిగువైన కథ అల్లుకోవడం ఆషామాషీ కాదు. యుగయుగాలుగా పేద, ధనిక వర్గం మధ్య మనస్తత్వాల్లో ఎన్నో తేడాలు గమనిస్తూనే వున్నాం. అయితే ఈ రెంటిలో ఏ వర్గానికి చెందినా అసలు నేనెవరు అన్న ప్రశ్న వేసుకున్న వాళ్ళు సమాజానికి మార్గదర్శకులు అవుతారు.ఇప్పుడు దర్శకుడు సంపత్ నంది కూడా క్లిష్టమైన ఈ రెండు అంశాల్ని కలిపి అల్లుకున్న కధే గౌతమ్ నంద. అయితే ముందు చెప్పుకున్నట్టు ఇది హీరో, దర్శకుడికి అగ్ని పరీక్షే. ఇందులో వాళ్ళు నెగ్గారో, లేదో చూద్దామా!
కథ…
సరదా కోసం ప్రపంచ యాత్ర చేసేంత కోటీశ్వరుని బిడ్డ గౌతమ్. దిగువ మాఫ్హ్యతరగతికి ఆనవాలు నంద. అయితే ఆ ఇద్దరు అచ్చు గుద్దినట్టు ఒకే పోలికలతో వుంటారు. ఆ ఇద్దరికీ తాము అనుభవిస్తున్న జీవితంలో సంతృప్తి దొరకదు. అయితే అన్నీ అనుభవించినవాడికే ముందుగా అసంతృప్తి మొదలవుతుంది. ఈ జీవితానికి అర్ధం తాను అనుభవిస్తున్న భోగభాగ్యాలు కాదనుకునే గౌతమ్ అసలు తానేమిటో అర్ధవంతంగా తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో గౌతమ్ , నంద ఒకరి స్థానంలో ఇంకొకరు 30 రోజులు మండేలా ఓ ఒప్పందానికి వస్తారు. ఈ ప్రయాణంలో వారికి భిన్నమైన అనుభవాలు ఎదురు అవుతాయి. ఇంతలో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మారిన స్థానాన్ని శాశ్వతం చేసుకోడానికి ఆ ఇద్దరిలో ఒకరు ఇంకొకరిని చంపేయాలనుకుంటారు. దీంతో ఆ రెండో వ్యక్తికి ఆ ప్రమాదం నుంచి బయటపడటంతో పాటు తానెవరో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమి జరిగిందన్నది తెలియాలంటే గౌతమ్ నంద చూడాలి.
విశ్లేషణ…
ఎవరికైనా వరస అపజయాలు ఎదురు అవుతుంటే సేఫ్ ప్రాజెక్ట్స్ చూసుకోవాలి అనుకుంటారు. అయితే సేఫ్ ప్రాజెక్ట్స్ అనుకున్నవే బోల్తా పడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో రిస్క్ తీసుకుంటారు. కొత్త కొత్త ప్రయత్నాలతో తమ ప్రతిభకి పదును పెట్టుకుంటారు. ఇప్పుడు హీరో గోపీచంద్ గౌతంనంద చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి కథతో రొటీన్ సినిమాల ఒరవడిలో కొట్టుకుపోతున్న గోపీచంద్ ని ఒప్పించడమే సంపత్ నంది సగం సక్సెస్ అయినట్టు. చాన్నాళ్ల తర్వాత ఓ మంచి కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న మంచి కథ కనిపించింది. కధలో ఉన్న బిగువు కధనంలో అక్కడక్కడా సడలినట్లు అనిపిస్తుంది. అయితే కధలో మలుపులు తీయడంలో సంపత్ బాగా సక్సెస్ అయ్యాడు. వెన్నెల కిషోర్, బిత్తరి సత్తి కామెడీ పర్లేదు అనిపిస్తుంది. ఇక సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది. అయితే ఆ సీన్స్ ఇంకా బాగా తీయాలి అనిపించింది. మొత్తానికి గౌతమ్ నంద గోపి చంద్ విజయ దాహాన్ని తీరుస్తుందనే చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్ …
కొత్త కధ
గోపి చంద్ డబల్ రోల్
ఫస్ట్ హాఫ్ లో లావిష్ సీన్స్
ఫోటోగ్రఫీ
దర్శకత్వం
మైనస్ పాయింట్స్ …
సెకండ్ హాఫ్ లో బిగి సడలింపు
సెంటిమెంట్ సీన్స్