ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురుచూస్తోన్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం దగ్గరపడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి ఆమోద ముద్ర పడింది. ఐతే కేబినెట్‌లో రెండు బెర్త్‌లను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది