Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జీఎస్టీని హడావిడిగా అమల్లోకి తెచ్చారని విపక్షాలు అంటే.. అదేం లేదు చాలా సుదీర్ఘ కసరత్తు జరిగిందని కేంద్రం దబాయించింది. కానీ పరిస్థితి చూస్తే మాత్రం విపక్షాల వాదనే నిజం అనిపించేలా ఉంది. ఎందుకంటే జీఎస్టీ ఫిట్ మెంట్ కమిటీ చేసిన తాజా సిఫార్సులు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. సుదీర్ఘ చర్చల తర్వాత అన్ని వస్తువులపై పన్నురేటు ఫిక్స్ చేస్తే.. కొన్నింటిపై పన్ను తగ్గించాలని సిఫార్సు చేసింది ఫిట్ మెంట్ కమిటీ.
ఇప్పుడీ సిఫార్సులు విపక్షాలకు అందొచ్చిన ఆయుధంగా మారాయి. ఇప్పటికే ప్రాజెక్టులపై పన్నెండు శాతం పన్ను ఎక్కువేనని చాలా రాష్ట్రాలు నోరు విప్పుతున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ తీసుకొచ్చేటప్పుడు చెప్పిన మాటలకి.. ఇప్పుడు అమలౌతున్న దానికి పొంతన లేదని సీఎంలు అసహనంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇరవై వస్తువులపై పన్ను తగ్గిస్తే.. మిగతా డిమాండ్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బ్రాండెడ్ ఆహార వస్తువులపై ఎక్కువ పన్ను వేయడం సరికాదని, వాటిపై కూడా పన్ను ఐదు శాతం ఉండాలని ఫిట్ మెంట్ కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కౌన్సిల్ లో రాష్ట్రాల మాట చెల్లుతుందా.. కేంద్రం నెగ్గుకొస్తుందా అనేది కీలకంగా మారింది. మరిప్పుడేం చేస్తారనేది ఆసక్తికరమే.
మరిన్ని వార్తలు: