Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత మరే సినిమాకు ఇప్పటి వరకు కమిట్ అయ్యింది లేదు. ప్రతాపరుద్రుడు అనే చిత్రాన్ని చేస్తాను అంటూ అప్పుడే ప్రకటించినా కూడా ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చలు, వర్క్ ఏమీ ప్రారంభం కాలేదు. ఇక ఇటీవల హిరణ్య కశ్యపుడు అనే చిత్రాన్ని చేస్తాను అంటూ గుణశేఖర్ ఒక మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. ఆ సినిమా గురించి ఇప్పటి వరకు మరెలాంటి ప్రకటన రాలేదు. అయినా కూడా చిత్ర పరిశ్రమలో పలు వార్తలు ఆ సినిమా గురించి చక్కర్లు కొడుతున్నాయి. రానాతో ఆ సినిమాను చేసేందుకు గుణశేఖర్ సిద్దంగా ఉన్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
భల్లాలదేవుడు పాత్రతో రానాకు మంచి క్రేజ్ దక్కింది. బాహుబలితో బాలీవుడ్ మరియు కోలీవుడ్లో కూడా రానాకు మంచి మార్కెట్ ఏర్పడటం జరిగింది. ఆ కారణంగానే రానాతో ‘హిరణ్యకశ్యపుడు’ చిత్రాన్ని ఏకంగా 100 కోట్లు పెట్టి తెరకెక్కించాలని నిర్ణయించాడు, ప్రస్తుతం నిర్మాత కోసం గుణశేఖర్ అన్వేషిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరి కాంబినేషన్లో 50 కోట్లు పెట్టడం కూడా చాలా ఎక్కువ. వీరిద్దరికి ఉన్న మార్కెట్ దృష్ట్యా 50 కోట్లు పెడితే భారీ విజయాన్ని సాధిస్తే అప్పుడు బడ్జెట్ రికవరీ అవుతుంది. అదే 100 కోట్లు పెడితే బ్లాక్ బస్టర్ సక్సెస్ అయినా కూడా సినిమాకు బడ్జెట్ రికవరీ కాదు.
టాలీవుడ్లో చాలా సంవత్సరాల క్రితమే భారీ సెట్టింగ్లు వేసి, భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించిన గుణశేఖర్ ఇప్పటి వరకు కూడా భారీ కమర్షియల్ సక్సెస్ను పొందలేదు. ఈయన సినిమాలు సక్సెస్ అయ్యి చాలా కాలం అయ్యింది. అందుకే ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు నిర్మాతలు జంకుతున్నారు. ఈయనతో 100 కోట్లు పెట్టి కూర్చునేందుకు ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాడు అనే విషయం అంతా ఒప్పుకోవాల్సిందే. ఒక వేళ గుణశేఖర్, రానాల కాంబినేషన్లో 100 కోట్లు పెట్టి ఎవరైనా సినిమాను నిర్మిస్తే ఖచ్చితంగా సగం లాస్ అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.