Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో వుంది. కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించడానికి జగన్ పాదయాత్ర మొదలెట్టారు. ఆ యాత్ర మొదలైన తర్వాత కూడా వైసీపీ కి చెందిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు పార్టీ ని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి పార్టీ మారినప్పుడు పాదయాత్ర చేస్తున్న జగన్ ను నైతికంగా దెబ్బ తీయడానికి ఆమెను అధికార పార్టీ ఆకట్టుకుందన్న వాదనలు వినిపించాయి. కానీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారినప్పుడు మాత్రం ఆ వాదనకు బలం లేకుండా పోయింది.కారణం జగన్ కు ఉన్న బలమైన మద్దతుదారుల్లో ఆమె ఒకరు. జగన్ కోసం ఒకప్పుడు ఆమె సీఎం చంద్రబాబు మీద పరుష పదజాలం ప్రదర్శించారు. అలాంటి ఈశ్వరి పార్టీ మారడం వైసీపీ ని ఆత్మశోధనలో పడేసిన మాట నిజం. పార్టీలో మిగిలిన నేతలు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటున్నారో ఏమో గానీ జగన్ కుటుంబంలోని మహిళలు మాత్రం బాగా సీరియస్ గా తీసుకున్నారు.
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమెకు స్వయంగా వై.ఎస్ జగన్ సతీమణి భారతి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈశ్వరుని బుజ్జగించేందుకు ఆమె గట్టి ప్రయత్నం చేశారట. విజయ సాయి రెడ్డి వైఖరితో తాను ఏ ఇబ్బందులు పడుంతుందో ఈశ్వరి వివరించినప్పుడు ఆమెను అనునయించడానికి భారతి బాగా చొరవ చూపారట. అయితే అప్పటికే టీడీపీ కి ఇచ్చిన మాట తప్పలేనని ఈశ్వరి సున్నితంగా భారతి మాట తిరస్కరించారట. ఇక అనంతపురం లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కూడా టీడీపీ లో చేరడానికి రెడీ అవుతున్నారు. ఎంపీ దివాకర్ రెడ్డి చొరవతో ఈయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నాడు. గుర్నాధరెడ్డిని నిలువరించడానికి జగన్ తల్లి విజయమ్మ గట్టి ప్రయత్నం చేశారట. ఫోన్ లోవిజయమ్మ స్వయంగా గుర్నాథరెడ్డి తో చర్చించారట. కానీ గుర్నాథ రెడ్డి వైసీపీ లో కొనసాగడం కష్టమే అంటున్నారు. దీంతో జగన్ తరపున ఆయన కుటుంబ సభ్యలు చేసిన రెండు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ పరిణామాలకు కారణం ఏంటో జగన్ మహిళా సైన్యం ఆలోచించుకోవాలి. తప్పొప్పులు బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి.